అధ్యాత్మ సంకీర్తన
రేకు: 192-1
సంపుటము: 2-468
రేకు: 192-1
సంపుటము: 2-468
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| నిరుహేతుకాన నన్ను నీవు రక్షించే వింతే నిరతి నాకొరకే పో నిను సేవించేది | ॥పల్లవి॥ |
| ముందు సిరులిత్తువని మోక్షము నీ విత్తువని బందుకట్టుదు దుఃఖములఁ బాపుదువని యిందలి యాసలనేపో యేచిన నాభయభక్తి యెందును నావల్ల నీకు నించుకంతా లేదు | ॥నిరు॥ |
| జననాలు చూచి చూచి సరి మరణాలు చూచి వెనకటి నీకథలు వినివిని వినుపై యీయాసనేపో విన్ను సారెఁ బొగడేది వొనర నీయాసేపో వుపకారగురువు | ॥నిరు॥ |
| లోకులు గొలువఁగాను లోన నీవు వుండఁగాను దీకొని గురుఁడు బోధించఁగాను కైకొని శ్రీవేంకటేశ కరుణించగా నీవు దాకొని యీయాసకే నీదాసినై కొలిచితి | ॥నిరు॥ |


