| కీర్తనలు | భద్రాచల రామదాసు | అంతా రామమయంబీ జగమంతా రామమయం |
| వరాళి - ఆది |
| పల్లవి: |
| అంతా రామమయంబీ జగమంతా రామమయం అం.. |
| చరణము(లు): |
| అంతరంగమున నాత్మారాముం డ నంతరూపమున వింతలు సలుపగ అం.. |
| సోమసూర్యులును సురలును తారలును ఆ మహాంబుధులు నఖిల జగంబులు అం.. |
| అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ అం.. |
| నదులు వనంబులు నానామృగములు విదితకర్మములు వేదశాస్త్రములు అం.. |
| అష్టదిక్కులును నాదిశేషుడును అష్టవసువులును నరిషడ్వర్గము అం.. |
| ధీరుడు భద్రాచల రామదాసుని కోరిక లొసగెడి తారకనామము అం.. |