| కీర్తనలు | భద్రాచల రామదాసు | అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురా |
| అసావేరి - ఆది |
| పల్లవి: |
| అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురా జబ్బుసేయకురా తబ్బిబ్బాయెనురా అ.. |
| చరణము(లు): |
| అట్టె నిను పూజించినట్టి చేతులనిదిగో కట్టె బెట్టి కొట్టిరెటు తాళుదునయ్య అ.. |
| రట్టుతీర్చీవేళ గట్టిగా నీవునను జెట్టుబట్టి యేలుకో పట్టాభిరామ అ.. |
| శరణాగతత్రాణ బిరుదాంకుడవుగాద శరధిబంధించిన శౌర్యమేమాయెరా అ.. |
| పరంధామ నీ పాదములాన వినరా పరులకొక్క కాసు నే నివ్వలేదురా అ.. |
| భద్రాద్రి శ్రీరామ నీ నామమెపుడు ప్రేమతో భజియించు రామదాసునేలు అ.. |