కీర్తనలు భద్రాచల రామదాసు అమ్మ ననుబ్రోవవే రఘురాముని
సావేరి- త్రిపుట
చరణము(లు):
అమ్మ ననుబ్రోవవే రఘురాముని
కొమ్మ ననుగావవే అ..
అమ్మ నను బ్రోవవే సమ్మతితోడ మా
యమ్మ వనుచు నిన్ను నెమ్మది గొలిచెద అ..
కన్నతల్లి నీవు కనుగొని నా పాటు
విన్నప మొనరించి వేగమే విభునితో అ..
యుల్లములోన మీయుభయుల నెర నమ్మి
యెల్లవేళల వేడి వేసారితి నిపుడు అ..
చలముమాని భద్రశైల రామదాసు
నలసట బెట్టక యాదరణ జేసి రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - amma nanubroovavee raghuraamuni ( telugu andhra )