| కీర్తనలు | భద్రాచల రామదాసు | అయ్యయ్యో నీవంటి అన్యాయదైవము |
| ముఖారి - త్రిపుట |
| పల్లవి: |
| అయ్యయ్యో నీవంటి అన్యాయదైవము నెయ్యడగాననయ్య శ్రీరామయ్య అ.. |
| అను పల్లవి: |
| ఇయ్యెడ నేను కుయ్యడిన ఆలకించ వయ్యయ్యో యేమందు అయ్యా రామచంద్ర అ.. |
| చరణము(లు): |
| ఎంతని వేడుదు ఎంతని పాడుదు ఎంతని దూరుదు ఏమిసేతు రామ సుంతైనగాని నీ అంతరంగమదేమో వింత కరుగదు ఎంతో నమ్మినందుకు అ.. |
| శరణన్న జనముల బిరబిర బ్రోచేటి బిరుదు గలిగినయట్టి దొరవని నే నీ మరుగు జొచ్చినందు కరమర జేయుట పరువే కరుణింప బరువే హరి హరి అ.. |
| కామిత మందార కలుష విదూర తామసమేల తాళజాలనురా నీ మోము జూపుము స్వామి భద్రాచల రామదాసుని ప్రేమ రయమున నేలుము అ.. |