కీర్తనలు భద్రాచల రామదాసు అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి
మేచబౌళి - త్రిపుట
పల్లవి:
అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి అ..
అను పల్లవి:
వెయ్యారు జన్మాల వెత జెందితి గాని
చెయ్యన సద్గతి సాధింప లేనైతి అ..
చరణము(లు):
మోస మేమని తలచియుండు దోస
వాసనల తగిలితేమందు ఆశా
పాశములను అరసి బ్రోచి ముందు
వాసిగ వైరాగ్య వాసన గననైతి అ..
మూడు మేలని నమ్మియుంటి నిరు
మూడు శత్రుల కూడియుంటి మాటికి
రెంటి మార్చి శత్రు మూటికెక్కువైన
కూటస్థు పొగడ నేను కూడ లేనయితి అ..
వదలించి బంధముల విడజేసిన భద్ర
గిరి రాఘవులతో నేను కలసి
సదయుడవైగని శ్రీరామదాసుని
స్థిరముగ పోషించుడని వేడనైతి అ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - ayyayyoo nee neeranaiti aadinaaraayaNuni teliyanaiti ( telugu andhra )