| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఇతడేనా ఈ లోకములో గల |
| శంకరాభరణ - త్రిపుట |
| పల్లవి: |
| ఇతడేనా ఈ లోకములో గల పతితుల నెల్లను పావనము చేయువాడు ఇ.. |
| చరణము(లు): |
| పరిపూర్ణకరుణచే బ్రహ్మాదుల గాచిన నరసింహుడైనట్టి నళినదళేక్షణుడు ఇ.. |
| ఇల లంకపురమున అవనిజను బ్రోవ బలుడైన రావణుని పరిమార్చినవాడు ఇ.. |
| అలనాడు ద్రౌపతికి అక్షయవలువలు వల నొప్పనొసగిన వైకుంఠవాసుడు ఇ.. |
| ఏ వేళ మునివరులు నితర చింతలు మాని కేవలము మదినుంచి కొలువు గాచెడువాడు ఇ.. |
| ప్రేమను దయతో నాపన్నుల బ్రోచుచు రామదాసునేలు రామచంద్రవిభుడు ఇ.. |