| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి |
| వరాళి - ఆది (మోహన - ఆది) |
| పల్లవి: |
| ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ముదముతో సీత ముదిత లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతియుండెడి ఇది.. |
| చరణము(లు): |
| చారుస్వర్ణప్రాకార గోపుర ద్వారములతో సుందరమైయుండెడి ఇది.. |
| అనుపమానమై యతిసుందరమై దనరుచక్రమది ధగధగ మెరిసెడి ఇది.. |
| కలియుగమందున నిలవైకుంఠము నలరుచునున్నది నయముగ మ్రొక్కుడి ఇది.. |
| పొన్నల పొగడల పూపొదరిండ్లతొ చెన్నుమీరగను చెలగుచునున్నది ఇది.. |
| శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము ఇది.. |