కీర్తనలు భద్రాచల రామదాసు ఉన్నాడో లేడో భద్రాద్రియందు ఉ..
అసావేరి - త్రిపుట
పల్లవి:
ఉన్నాడో లేడో భద్రాద్రియందు ఉ..
చరణము(లు):
ఉన్నాడో లేడో యాపన్న రక్షకుడు
ఎన్నాళ్ళు వేడిన కన్నుల కగపడడు ఉ..
నన్నుగన్న తండ్రి నా పెన్నిధానము
విన్నపము విని తా నెన్నడు రాడాయె ఉ..
ఆకొని నే నిపుడు చేకొని వేడితే
రాకున్నా డయ్యయ్యో కాకుత్స్థ తిలకుడు ఉ..
వాటముగ భద్రాచల రామదాసుతో
మాటలాడుటకు నాటకధరుడు ఉ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - unnaaDoo leeDoo bhadraadriyaMdu u.. ( telugu andhra )