| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఎందుకు దయరాదు శ్రీరామ |
| ఆనందభైరవి - తిశ్ర ఏక |
| పల్లవి: |
| ఎందుకు దయరాదు శ్రీరామ నేనేమి చేసితి శ్రీరామ ఎం.. |
| చరణము(లు): |
| గతినీవే యనుకొంటి శ్రీరామ నా వెత మాన్పవయ్య శ్రీరామ ఎం.. |
| చేపట్టి రక్షింపవేల శ్రీరామ నాప్రాపు నీవేనయ్య శ్రీరామ ఎం.. |
| అయ్యయ్యో నానేరమేమి శ్రీరామ నా కుయ్యాలింపవయ్య శ్రీరామ ఎం.. |
| ఇంక నీదయ రాకుంటె శ్రీరామ నా సంకట మెటుతీరు శ్రీరామ ఎం.. |
| ఏండ్లు పండ్రెండాయెనే శ్రీరామ నీ కండ్లకు పండుగె శ్రీరామ ఎం.. |
| వాసియౌ భద్రాద్రివాస శ్రీరామ రామ దాసుని విడువకు శ్రీరామ ఎం.. |