కీర్తనలు భద్రాచల రామదాసు ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామా
కాంభోజి - ఆది (త్రిపుట)
పల్లవి:
ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామా
అక్కట నాకన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా ఎ..
చరణము(లు):
ప్రకటమాయెను పాపములెటుల బాధకోర్తును శ్రీరామా
సకలలోక రాజ్యపదవికి ఎక్కువైనయట్టి శ్రీరామా ఎ..
పృథివిలోన పూర్వజన్మల పూజలింతేగా శ్రీరామా
విధులు జరుపవలయు విషయవాంచలు దలుపక శ్రీరామా ఎ..
మూడు నెలలాయె నీ మునుముందర నిల్వక శ్రీరామా
ఎన్నడిట్లుండి రాఘవ నేనెరుగ నను గన్నయ్యా శ్రీరామా ఎ..
కోరి భద్రాచలమున రాముని కొలుతునంటిని శ్రీరామా
కోర్కెలొసగి రామదాసుని గనుగొని రక్షింపుమంటి శ్రీరామా ఎ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - ekkaDi karmamulaDDupaDenoo yeemiseeyudunoo shriiraamaa ( telugu andhra )