కీర్తనలు భద్రాచల రామదాసు ఎటుబోతివో రామ ఎటుబ్రోతువో రామ ఎ..
ఆనందభైరవి - ఆట (- ఆది)
పల్లవి:
ఎటుబోతివో రామ ఎటుబ్రోతువో రామ ఎ..
చరణము(లు):
ఎటుబోతివో నిన్ను వేడుకొంటే
కటకటానేడు నా కనుల జూతామంటె ఎ..
అంధకారమువంటి బంధిఖానాలో నున్న
నింద బాపవదేల మ్రొక్కెద స్వామి ఎ..
పాపములన్నియు యెడబాపే దొరవు నీవు
ఆపద దీర్చి నన్నాదుకొమ్మంటి స్వామి ఎ..
తానీషాగారు వచ్చి సరితీర్పు జేసెదరు
పన్నుల పైకము బంపి బంధిఖానా వదిలించు ఎ..
అపరాధినని చాల నుతిచేసి మొరలిడగ
నెపమెంచి విడిచేవు నేరములు తలచి ఎ..
అప్పులవారొచ్చి యరికట్టుచున్నారు
ఒప్పుకోబడునని చెప్పక దాగినావు ఎ..
నీవు భద్రాచలనిలయుడవయ్యు రామ
బ్రోవుమయ్య రామదాసు నేలెడిస్వామి ఏ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - eTubootivoo raama eTubrootuvoo raama e.. ( telugu andhra )