కీర్తనలు భద్రాచల రామదాసు ఎవరు దూషించిన నేమి వచ్చె మరి
బిళహరి - త్రిపుట
పల్లవి:
ఎవరు దూషించిన నేమి వచ్చె మరి
ఎవరు భూషించిన నేమి వచ్చె మరి
అవగుణములు మాన్పి ఆర్చేర తీర్చేర
నవనీతచోరుడు నారాయణుడుండగ ఎ..
చరణము(లు):
పిమ్మట నాడిన నేమి మంచి
ప్రియములు ఒలికిన నేమి కొమ్మిదే
రమ్మని కోరిక లొసగెడి నాపాల
సమ్మతిగ సర్వేశ్వరుడుండగ ఎ..
వారి పంతము మాకేల వట్టి
వాదులతోడ పోరేల భాషించు
వారితో పలుమారు పొందేల కాచి
రక్షించెడి ఘనుడు శ్రీరాముడుండగా ఎ..
అపరాధముల నెంచువారు మాకు
ఉపకారులై యున్నారు రామ
విపరీత చరితలు వినుచు ఎల్లప్పుడు
కపట నాటకధారి కనిపెట్టియుండగ ఎ..
వాసిగ ఏలువాని విధములు తలుపనేల
వాసనల భ్రమయనేల భద్రాద్రి
వాసుడై నిరతము భాసురముగ రామ
దాసు నేలిన వాడు దయతోడ నుండగ ఎ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - evaru duushhiMchina neemi vachche mari ( telugu andhra )