| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఏడనున్నాడో నా పాలిరాము |
| వరాళి - ఆది |
| పల్లవి: |
| ఏడనున్నాడో నా పాలిరాము డేడనున్నాడో నా పాలిదేవు డేడనున్నాడో ఏ.. |
| చరణము(లు): |
| ఏడనున్నాడో గానిజాడ తెలియరాదు నాడు గజేంద్రుని కీడుబాపినతండ్రి ఏ.. |
| ద్రౌణిబాణజ్వాల దాకిన బాలునికి ప్రాణమిచ్చిన జగత్ప్రాణరక్షకుడు ఏ.. |
| పాంచాలి సభలోన భంగమొందిననాడు వంచనలేకను వలువలిచ్చినతండ్రి ఏ.. |
| దూర్వాసుడుగ్రమున ధర్మసుతునిజూడ నిర్వహించిన నవనీత చోరకుడు ఏ.. |
| అక్షయముగ భద్రాచలమందున సాక్షాత్కరించిన జగదేకవీరుడు ఏ.. |