| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఏమయ్యరామ బ్రహ్మేంద్రాదులకునైన |
| కల్యాణి - రూపక (కాంభోజి - ఝంప) |
| పల్లవి: |
| ఏమయ్యరామ బ్రహ్మేంద్రాదులకునైన నీ మాయ దెలియవశమా శ్రీరామ ఏ.. |
| అను పల్లవి: |
| కామారివినుత గుణధామ కువలయదళ శ్యామ ననుగన్నతండ్రి శ్రీరామ ఏ.. |
| చరణము(లు): |
| సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవు డతిబలుడనుచు కపులు శ్రీరామ క్షితినాథుడనుచు భూ పతులు కొలిచిరిగాని పతితపావనుడనుచు మదితెలియలేరైరి ఏ.. |
| చెలికాడనుచు పాండవులు విరోధివటంచు నలజరాసంధాదులు శ్రీరామ కలవాడవని కు చేలుడు నెరిగిరిగాని జలజాక్షుడని నిన్ను సేవింపలేరైరి ఏ.. |
| నరుడవని నరులు తమ దొరవనుచు యాదవులు వరుడవనుచు గోపసతులు శ్రీరామ కరివరద భద్రగిరి శ్రీరామదాసనుత పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి ఏ.. |