| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ |
| నాదనామక్రియ - ఆది |
| పల్లవి: |
| ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ ఏమిర రామ యీ కష్టము నీమహిమో నాప్రారబ్ధమో ఏ.. |
| చరణము(లు): |
| కుండలిశయన వేదండ రక్షకా అఖండతేజ నాయండ నుండవే ఏ.. |
| పంకజలోచన శంకరనుత నా సంకటమును మాన్పవె పొంకముతోను ఏ.. |
| మందరధర నీ సుందర పదములు ఇందిరేశ కనుగొందు జూపవే ఏ.. |
| దినమొక ఏడుగ ఘనముగ గడిపితి తనయుని మీదను దయలేదయయో ఏ.. |
| సదయహృదయ నీ మృదుపదములు నా హృదయ కమలమున వదలక నిలిపితి ఏ.. |
| రామ రామ భద్రాచల సీతా రామదాసుని ప్రేమతో నేలవే ఏ.. |