| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఏల దయరాదో రామయ్య |
| పున్నాగవరాళి - ఆట ( - ఆది) |
| పల్లవి: |
| ఏల దయరాదో రామయ్య ఏల దయ రాదో రామయ్య నీకు ఏ.. |
| అను పల్లవి: |
| శ్రీమేలుకై పాటుబడితినని యే ల యీ యభాండము చాలుచాలును ఏ.. |
| చరణము(లు): |
| బ్రహ్మగూర్చెగదే అహోపర బ్రహ్మ కావగదే రామ బ్రహ్మజనక భవబ్రహ్మేంద్రాదులు బ్రహ్మానందము పాలైనారట ఏ.. |
| పాపములచేత రామయ నే నోపలేను గద రామ శ్రీపతి యేప్రాపులేకను నీ ప్రాపె గోరితి భక్తపాపహరణ హరి ఏ.. |
| తలపగ జాల ఆనంద బాష్పము లూరెగద రామ నీలనీరదనిభ కోమలరూప భద్ర శైలవాస రామదాసు నేలగ ఏ.. |