| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఏలాగుతాళుదు నేమిసేతురా రామా |
| బేగడ - ఏక (- చాపు) |
| పల్లవి: |
| ఏలాగుతాళుదు నేమిసేతురా రామా ఈ జాలిచేతను తాళజాలనురా రామా ఏ.. |
| చరణము(లు): |
| దీనజనులకెల్ల దిక్కునీవే రామా మనమున నిన్ను నేమరవనో రామా ఏ.. |
| పావనమూర్తియో పట్టాభిరామా కావవే ఈవేళ కౌసల్యరామా ఏ.. |
| శరణని నీమరుగు జేరితిరామా శరణంటె కాచేది బిరుదు రఘురామా ఏ.. |
| చెప్పరాని ప్రేమ నెందుదాతుర రామా ఆపన్నరక్షకుడ నాపాలి శ్రీరామా ఏ.. |
| నీ సొమ్మునేననుట నిజమాయెరా రామా నా దోషములనన్ని దొలగింపవె రామా ఏ.. |
| రాతికైన చెమట రంజిల్లునే రామా ఆతీరు నీమనసునొందదే శ్రీరామా ఏ.. |
| యమబాధ లొందగ నేరనో రామా యమదండనలులేక యెడబాపురామా ఏ.. |
| వాసిగ రామకీర్తనలు జేసితి రామా దాసుడను నా మీద దయయుంచుమీ రామా ఏ.. |