కీర్తనలు భద్రాచల రామదాసు ఓ రఘునందన రారా రాఘవ శ్రీరఘునందన రారా రామ
కానడ -ఆది
పల్లవి:
ఓ రఘునందన రారా రాఘవ శ్రీరఘునందన రారా రామ
ఆశ్రిత సముదయ మందర రామ శ్రీరఘునందన రారా ఓ..
చరణము(లు):
యాది యుంచుమీ నామీదను నీకే దయ రావలెగాక రామ
పాదములకు నే మ్రొక్కెద నాకు ప్రత్యక్షము కారాదా రామ ఓ..
నీ కారుణ్యము తోను నేను నిర్వహింపతలచెదను రామ
నీకే మరులు కొన్నాను నీనిద్దంపు మోము చూచెద రామ ఓ..
సరసిజ భవనుత శౌరి నీ సరి దైవములిక యేరి రామ
శరణంటిని నే నిన్నే గోరి శరజాల శరాసనధారి రామ ఓ..
సతతము నామదిలోను నిన్ను సంస్మరింపతలచెదను రామ
గతినీవని నమ్మినాను యే గతి బ్రోచిన నీవేను రామ ఓ..
వరభద్రాద్రినివాస భావజ శతకోటి విలాసా రామ
పరమానందవికాసా పరిపాలిత శ్రీరామదాస ఓ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - oo raghunaMdana raaraa raaghava shriiraghunaMdana raaraa raama ( telugu andhra )