| కీర్తనలు | భద్రాచల రామదాసు | కటకటనీదు సంకల్పమెట్టిదోగాని |
| కాంభోజి - ఏక (-త్రిపుట) |
| పల్లవి: |
| కటకటనీదు సంకల్పమెట్టిదోగాని నేనెంతవాడనురా రామ క.. |
| నిటలాక్షుడు తొల్లి నీమాయ గనలేక తటుకున నీ వలదగిలెను గనుక క.. |
| చరణము(లు): |
| శరణన్న మునులను బిరబిర బ్రోచెడు బిరుదు గలిగిన దొరవే ఓ రామ పరిపరివిధముల మొరలిడ వినక న న్నరమరచేసిన హరి నిన్నేమందు క.. |
| భావజజనక నా భావమెరుగ వే వేగమున జూడవే ఓ రామ దేవాదిదేవ దేవ దీనశరణ్య నీవే దిక్కని నిక్కము నమ్మితి క.. |
| గీర్వాణనుత భద్రగిరివాస సర్వయో గీశ్వరేశ్వర రామ ఓ రామ సర్వాత్మ రామదాస హృదయాబ్జ నిలయ సర్వాధార పరాకేల రామా క.. |