| కీర్తనలు | భద్రాచల రామదాసు | కరుణించు దైవలలామ అహో |
| సౌరాష్ట్ర - ఆది (త్రిపుట) |
| పల్లవి: |
| కరుణించు దైవలలామ అహో పరమపావననామ పట్టాభిరామా క.. |
| చరణము(లు): |
| అన్నవస్త్రము లిత్తుమనుచు దొర లన్నారు మనిచెదమనుచు ఆయు రన్నం ప్రయచ్ఛతియనుచు నూర కున్నాను నీవే మాకున్నావనుచు క.. |
| మరి యింతకాలమ్ముదనుక మిమ్ము మరచితినని తప్పుతలచక మమ్ము దరిజేర్చుడని వేడితిని మీది శరణాగతత్రాణ బిరుదు కనుక క.. |
| పరులను గొలుచుటకన్న ఇల భద్ర గిరిరాఘవుల వేడుకొనుట ఇహ పరములకు దారియని విన్టినే దరహాసముఖ రామదాసపోష క.. |