| కీర్తనలు | భద్రాచల రామదాసు | కోదండరాములు మముగన్నవారు |
| ధన్యాసి - ఆది ( - తిశ్ర ఏక) |
| పల్లవి: |
| కోదండరాములు మముగన్నవారు కుదురుగ మము పెంచి విడనాడలేరు కో.. |
| చరణము(లు): |
| ముదముతో గూడుకొని తమ్మునితోడ ఖలులు బాధించు వేళ నాకు భక్తితోడు కో.. |
| సీతారామనామములే మా జిహ్వయందు యమ దూతల బారద్రోలు దొడ్డమందు కో.. |
| పట్టాభిరాముల చేపట్టినాము మేము గట్టిగ యమునికి నామమిడినాము కో.. |
| ప్రేమతో భద్రగిరీశ రామదాసుని రామస్వామి వేగ రక్షింపుమయ్యా కో.. |