కీర్తనలు భద్రాచల రామదాసు చరణములే నమ్మితి నీదివ్యచరణములే నమ్మితి చ..
కాపీ - ఆది
పల్లవి:
చరణములే నమ్మితి నీదివ్యచరణములే నమ్మితి చ..
చరణము(లు):
వారధిగట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా నీదివ్య చ..
ఆదిశేష నన్నరమర చేయకు మయ్యా అయ్యా అయ్యా నీదివ్య చ..
వనమున రాతిని వనితగ చేసిన చరణం చరణం చరణం నీదివ్య చ..
పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి నీదివ్య చ..
వెయ్యారు విధముల కుయ్యాలించిన అయ్యా అయ్యా అయ్యా నీదివ్య చ..
బాగుగ నన్నేలు భద్రాచల రామదాసుడ దాసుడ దాసుడ నీ దివ్య చ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - charaNamulee nammiti niidivyacharaNamulee nammiti cha.. ( telugu andhra )