| కీర్తనలు | భద్రాచల రామదాసు | తర్లిపోదము చాలా దయ యుంచండి ఇక |
| పున్నాగవరాళి - ఆది (ఆనందభైరవి - ఆది) |
| పల్లవి: |
| తర్లిపోదము చాలా దయ యుంచండి ఇక మరలి జన్మకు రాము మదిలో నుంచండి త.. |
| చరణము(లు): |
| బార్లుగట్టి భక్తవరులు భజనలు చేయగను మూడు ఏర్లు గలసినట్టి దారి నెరిగి వేగముగ త.. |
| సోహంబనియెడి కత్తి చేగొని అట్టే మోహపాశములనెల్ల మొదటనే ద్రుంచి త.. |
| ఈషణత్రయములెల్ల నిలలోనె డించి సం తోష సాగరంబునందే సంచరించుచును త.. |
| తారక మంత్రౌషధ ధారలు గ్రోలి ఏపు మీరగాను మోక్షపదవి హెచ్చనుచు గాంచి త.. |
| ఆరు కమలములమీద నద్భుతమైన సహ స్రార కమలమందుజేరి సంతసించుచు త.. |
| చక్కని భద్రాద్రి రామస్వామి కృపను పెం పెక్కిన రామదాసులని పేరు గాంచినారము త.. |