| కీర్తనలు | భద్రాచల రామదాసు | దశరథరామ గోవిందా నన్ను దయజూడు పాహిముకుంద ద.. |
| కాఫి - చాపు (శంకరాభరణ -ఆది) |
| పల్లవి: |
| దశరథరామ గోవిందా నన్ను దయజూడు పాహిముకుంద ద.. |
| అను పల్లవి: |
| దశముఖ సంహార ధరణిజపతి రామ శశిధరపూజిత శంఖచక్రధర ద.. |
| చరణము(లు): |
| మీపాదములే గతిమాకు మమ్మేలుకోస్వామి పరాకు మాపాలగలిగిన శ్రీపతి యీప్రొద్దు కాపాడిరక్షించు కనకాంబరధర ద.. |
| నారాయణ వాసుదేవ నిను నమ్మితి మహానుభావ గరుడగమన హరి గజరాజరక్షక పరమపురుష భక్తపాపసంహరణ ద.. |
| తారక నామమంత్రము రామదాసులకెల్ల స్వతంత్రము ఇరవుగ కృపనేలు యిపుడు భద్రాద్రిని స్థిరముగ నెలకొన్న సీతామనోహర ద.. |