| కీర్తనలు | భద్రాచల రామదాసు | దినమే సుదినము సీతారామ స్మరణే పావనము ది.. |
| సావేరి - ఆది (కాపి- త్రిపుట) |
| పల్లవి: |
| దినమే సుదినము సీతారామ స్మరణే పావనము ది.. |
| చరణము(లు): |
| ప్రీతినైనా ప్రాణభీతినైనా కలిమి చేతనైనా మిమ్మేతీరుగ దలచిన ఆ ది.. |
| అర్థాపేక్షను దినము వ్యర్థము కాకుండ సార్థకముగ మిమ్ము ప్రార్థనజేసిన ఆ ది.. |
| నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘు వరుని పదముల నమరపూజించిన ఆ ది.. |
| మృదంగతాళము తంబురశ్రుతిగూర్చి మృదురాగము కీర్తన పాడినను విన్న ఆ ది.. |
| ఘనమైన భక్తిచే పెనగొని యేవేళ మనమున శ్రీరాముని చింతించిన ఆ ది.. |
| భక్తులతో ననురక్తిని గూడుక భక్తిమీరగను భక్తవత్సలుపొగడు ది.. |
| దీనశరణ్య మహానుభావ యో గానలోల నను కరుణింపుమని కొలుచు ఆ ది.. |
| వాసిగ శ్రీహరిదాసుల గూడుకొని వాసుదేవు వాంఛతోను బాడెడి ఆ ది.. |
| అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాముల జూచిన ఆ ది.. |