| కీర్తనలు | భద్రాచల రామదాసు | దీనదయాళో దీనదయాళో దీనదయాళో పరదేవదయాళో దీ.. |
| యమునా - చాపు (యమునాకల్యాణి - త్రిపుట) |
| పల్లవి: |
| దీనదయాళో దీనదయాళో దీనదయాళో పరదేవదయాళో దీ.. |
| చరణము(లు): |
| కనకాంబరధర ఘనశ్యామ దయాళో సనకాదిమునిజన వినుత దయాళో దీ.. |
| శరధిబంధన రామచంద్ర దయాళో వరదామర బృందానంద దయాళో దీ.. |
| నారదముని దేవనాథ దయాళో సారసాక్ష రఘునాథ దయాళో దీ.. |
| దశరథసుత లోకాధార దయాళో పశుపతి చాపత్రుటిత దయాళో దీ.. |
| ఆగమరక్షిత అమితదయాళో భోగిశయన పరమపురుష దయాళో దీ.. |
| వరభద్రాద్రినివాస దయాళో అర్చిత శ్రీరామదాస దయాళో దీ.. |