కీర్తనలు భద్రాచల రామదాసు దైవమని మీరలేక యింత తాళితిగాక పరాకా శ్రీరామా దై..
పంతువరాళి - ఆట (సింహేంద్రమధ్యమ - త్రిపుట)
పల్లవి:
దైవమని మీరలేక యింత తాళితిగాక పరాకా శ్రీరామా దై..
అను పల్లవి:
దేవుడవని నిన్ను దీనతవేడితి
కావక విడచిన కారణమేమో దై..
చరణము(లు):
కొలువున నిలిపిన వాడవు నీవు
తలపవేమి బడాయి నిలిచిన జీతంబీవోయీ
కులుకుచు తిరిగేవు సీతాదేవి తురాయి
ఆలసించకురా నీ బంట నన్నెరుగరా దై..
మూల దూరుక తలజూప వదేమ నీ సాటి వా
రలు నగుదురనక పేదసాదలున్నారని బెదరి
మూలమగు డబ్బియ్యక అబ్బురముగను
ఏల బొబ్బరించి పెదవుల తడుపుకొనేవు దై..
కలిగియు తగవా నిన్నరికట్టుదు ఎదురుండు
చెలువమైన పూలదండ మెడజుట్టుదు కోదండరామ
ఇలలో నొకరికి యీవలసిన సొమ్మును
తలచిచ్చి రామదాసుని దండను తప్పించుము దై..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - daivamani miiraleeka yiMta taaLitigaaka paraakaa shriiraamaa dai.. ( telugu andhra )