కీర్తనలు భద్రాచల రామదాసు నందబాలం భజరే బృందావన వాసుదేవం నం..
మాయామాళవగౌళ - ఏక (మణిరంగు - త్రిపుట)
పల్లవి:
నందబాలం భజరే బృందావన వాసుదేవం నం..
చరణము(లు):
జలజసంభవాది వినుత చరణారవిందం
లలిత మోహన రాధావదన నళినమిళిందం నం..
నిటలతట స్ఫుటకుటిల నీలాలక బృందం
ఘటితశోభిత గోపికాధర మకరందం నం..
గోదావరీతీర వాసగోపికా కామం
ఆదిత్యవంశాబ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం నం..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - naMdabaalaM bhajaree bR^iMdaavana vaasudeevaM naM.. ( telugu andhra )