కీర్తనలు భద్రాచల రామదాసు ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి న..
కల్యాణి - ఆది ( - త్రిపుట)
పల్లవి:
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి న..
చరణము(లు):
ననుబ్రోవమని చెప్పవే నారీశిరోమణి
జనకుని కూతుర జనని జానకమ్మ న..
ప్రక్కను చేరుక చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి సొక్కుచుండెడి వేళ న..
ఏకాంతరంగుడు శ్రీకాంత నినుగూడి
ఏకాంతమున నేకశయ్యనున్న వేళ న..
అద్రిజవినుతుడు భద్రగిరీశుడు
నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి న..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - nanubroovamani cheppavee siitammatalli na.. ( telugu andhra )