| కీర్తనలు | భద్రాచల రామదాసు | నా మొరాలకింపవేమయ్య ఓ రామ రామ |
| ఆరభి - చతురశ్ర ఏక |
| పల్లవి: |
| నా మొరాలకింపవేమయ్య ఓ రామ రామ నా మొరాలకింపవేమి నా.. |
| అను పల్లవి: |
| నా మొరాలకింపవేమి న్యాయమా ప్రపంచమందు స్వామి నీకన్న నన్ను సంతరించు వారలెవరు నా.. |
| చరణము(లు): |
| ఉన్నవిధము విన్నవించితి నా హృదయమందు నిన్ను మఱువకెప్పుడునుంచితి కన్నతండ్రివైన నీకు కఠినహృదయమైతే నేను కన్నవిన్నవారినెల్ల యిపుడు గాచి గొల్వలేను నా.. |
| మ్రొక్కగానే మోడిసేతురా నా పాపమెల్ల నుగ్గడింప నూరకుందురా దిక్కు ఎవరు లేరు నీవె దిక్కటుంచు నమ్మినాను ఇక్కడికి నీ కటాక్షమేల రాకున్నదయ్యయో నా.. |
| చేతగానివాడివైతివో మున్ను నీవు రాతికభయమీయవైతివో రామ భూతలమందు ప్రఖ్యాతి జెందినావు నాదు వ్రాతఫలమదేమో తలచవైతివయా నెనరులేదో నా.. |
| మదముచేత తెలియనైతిని పాపమంచు పృథివి యందు యెంచనైతిని ఓ రామ కదసి నేను చేసినట్టి కర్మ మనుభవించవలెను ఇదిగో నీ పాపముల గతి యటంచు నమ్మినాను నా.. |
| నీ సమాన దైవమెవ్వరు ఈ లోకమందు నీ సమానధీరులెవ్వరు దాసుడంటె భద్రశైలవాస వేరుసేయబోకు గాసి మాన్పుమిపుడు రామభూప వీరరాఘవేంద్ర నా.. |