| కీర్తనలు | భద్రాచల రామదాసు | నాతప్పులన్ని క్షమియించుమీ జగన్నాథ నీవాడ రక్షింపుమీ నా.. |
| అసావేరి - ఆది |
| పల్లవి: |
| నాతప్పులన్ని క్షమియించుమీ జగన్నాథ నీవాడ రక్షింపుమీ నా.. |
| అను పల్లవి: |
| పాతకుడని ఎంచక పోషించు దాతవనుచు నీపదములే నమ్మితి నా.. ఈయెడ నానేరమెంచక హితవున ద్వేషములెంచకు మ్రొక్కెద |
| చరణము(లు): |
| చేయరాని పనులెన్నోజేసితి కాయతీగకు ఎక్కువకాదుగదా నా.. |
| కడుపున బుట్టిన తనయుడు ఎంత దుడుకుతనము జేసినగాని కొడుకా రమ్మని చేకొనుగాని నూతిలోపడద్రోయునా ఎంత తండ్రి ఎవరైన నా.. |
| దాసుని మనవిని వినుము చక్రధర వాసవనుత నన్నేలుకొంటివా నాస్వామి నమ్మితిని భద్రాద్రినివాసుడ రామదాసు నేలుతండ్రి నా.. |