కీర్తనలు భద్రాచల రామదాసు నారాయణ నారాయణ జయగోపాల హరే కృష్ణ నా..
శంకరాభరణ - ఆది
పల్లవి:
నారాయణ నారాయణ జయగోపాల హరే కృష్ణ నా..
చరణము(లు):
శ్రీకౌస్తుభమణిభూష శృంగార మృదుభాష నా..
నందవరకుమార నవనీత దధిచోర నా..
కమనీయ శుభగాత్ర కంజాతదళనేత్ర నా..
కరుణాపారవార వరుణాలయ గంభీర నా..
మంజులకుంజభూష మాయామానుష వేష నా..
అజభవనుత కంసారే అచ్యుతకృష్ణ మురారే నా..
మురళీగాన వినోద వ్యత్యస్తపాదారవింద నా..
యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నా..
వరభద్రాచలవాస పాలితరామదాస నా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - naaraayaNa naaraayaNa jayagoopaala haree kR^ishhNa naa.. ( telugu andhra )