| కీర్తనలు | భద్రాచల రామదాసు | నిన్నునమ్మియున్నవాడను ఓ రామ ని.. |
| నాదనామక్రియ - ఆది (మాయామాళవగౌళ - త్రిపుట) |
| పల్లవి: |
| నిన్నునమ్మియున్నవాడను ఓ రామ ని.. |
| చరణము(లు): |
| నిన్ను నమ్మినవాడ పరులను వేడనిక మన్ననజేసి పాలింపవే ఓరామా ని.. |
| బ్రతిమాలి వ్రతము చెడుటేగాని యిదేమి సుఖము వెతనొందగ జాలనే ఓరామా ని.. |
| మానము విడిచి కసుమాల పొట్టకొరకై మానవుల వెంబడింతునే ఓరామా ని.. |
| సతతము రక్షించు చతురత నీకున్నప్పుడు మది చంచలింప నేటికే ఓరామా ని.. |
| సతతము భద్రాద్రిస్వామి శ్రీరామదాస పతివై నన్నాదరింపవే ఓరామా ని.. |