కీర్తనలు భద్రాచల రామదాసు పాలయమాం జయ రామ జయ భద్రాద్రీశ్వర రామ పా..
ముఖారి - ఆది
పల్లవి:
పాలయమాం జయ రామ జయ భద్రాద్రీశ్వర రామ పా..
చరణము(లు):
కమలావల్లభ రామజ కబంధ సంహర పా...
పరమాత్మనే శ్రీ రామజయ భక్తవరద సీతారామ పా...
కమలానాయక రామ జయ కమనీయానన రామ పా..
కంబుగ్రీవ రామ జయ కార్ముక పాణే పా..
కరిరాజప్రియ రామ జయ కౌస్తుభవక్ష రామ పా..
కౌస్తుభభూషణ రామ జయ కంజాత నేత్ర రామ పా..
కాళీయ శిక్షక రామ జయ కంబవినాశన రామ పా..
కరుణాంతరంగ రామ జయ కనకాంబరధర రామ పా..
కస్తురితిలక రామ జయ కందర్పజనక రామ పా..
దశరథ నందన రామ జయ దైత్య వినాశన రామ పా..
శరధిబంధన రామ జయ చారుసద్గుణ రామ పా..
అఖండరూప రామ జయ అమితపరాక్రమ రామ పా..
అపరిచ్ఛిన్న రామ జయ అంతర్యామిన్‌ రామ పా..
అనాథబంధో రామ జయ ఆత్మరక్షక రామ పా..
అక్రూరవరద రామ జయ అంబరీష వరద రామ పా..
అయోధ్యవాస రామ జయ అజ్ఞాననాశన రామ పా..
సీతాహృదయవిహార జయ కుత్సిత మానవ దూర పా..
పరమానంద విహార జయ పాలక భద్రవిహార పా..
సాధుపోషణ రామ జయ సజ్జనసులభ రామ పా..
సామగానప్రియ రామ జయ సహస్రబాహో రామ పా..
సనకాది వంద్య రామ జయ సదానంద రామ పా..
నిత్యానంద రామ జయ నిర్మలచిత్త రామ పా..
నిర్వికార రామ జయ నిగమగోచర రామ పా..
నీరజనాభ రామ జయ నిష్ప్రపంచ రామ పా..
నిత్యమహోత్సవ రామ జయ నిజదాసప్రియ రామ పా..
వీరరాఘవరామ జయ విజయార్చిత రామ పా..
భద్రాచలపతి రామ జయ పతితపావన రామ పా..
పాండవపక్ష రామ జయ పాపవినాశన రామ పా..
పాహి రఘూత్తమ రామ జయ పరమదయాళో రామ ప..
రాగరహిత రామ జయ రామదాసావన రామ పా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - paalayamaaM jaya raama jaya bhadraadriishvara raama paa.. ( telugu andhra )