కీర్తనలు భద్రాచల రామదాసు పాలయమాం రుక్మిణీ నాయక భక్త కామితదాయక
శ్రీ - ఆది
పల్లవి:
పాలయమాం రుక్మిణీ నాయక భక్త కామితదాయక
నీలవర్ణ తులసీవనమాల నిరుపమశీల బృందావనలోల పా..
చరణము(లు):
కనకాంబరధర కమనీయ విగ్రహ కాళీయమదనిగ్రహ
సనకాదిసన్నుత చరణారవింద సచ్చిదానంద గోవింద ముకుంద పా..
గోపవేషధర గోవర్ధనోద్ధార గోకులకలహంస
పాపాంధకార దివాకర శ్రీకర తాపసమానస సారస హంస పా..
నీలాంబరధర నిత్యనిర్వికార నిగమాంత సంచార
బాలార్కకోటి ప్రకాశవిలాస రామదాస హృదయాబ్జ నివాస పా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - paalayamaaM rukmiNii naayaka bhakta kaamitadaayaka ( telugu andhra )