| కీర్తనలు | భద్రాచల రామదాసు | పాహిరామప్రభో పాహిరామప్రభో |
| నాదనామక్రియ - ఏక (మధ్యమావతి - ఝంప) |
| చరణము(లు): |
| పాహిరామప్రభో పాహిరామప్రభో పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో పా.. |
| శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ నామకీర్తనలు వర్ణింతు రామప్రభో పా.. |
| సుందరాకార హృన్మందిరోద్ధార సీ తేందిరా సంయుతానంద రామప్రభో పా.. |
| ఇందిరా హృదయారవిందాదిరూఢ సుందారాకార ఆనంద రామప్రభో పా.. |
| ఎందునేజూడ మీసుందరాననము కందునో కన్నులింపొంద రామప్రభో పా.. |
| పుణ్యచారిత్రలావణ్య కారుణ్య గాం భీర్య దాక్షిణ్య శ్రీరామచంద్రప్రభో పా.. |
| కందర్పజనక నాయందు రంజిల సదా నందుడవై పూజలందు రామప్రభో పా.. |
| ఇంపుగా జెవులకు న్విందుగా నీకథల్ కందుగా మిమ్ము సొంపొంద రామప్రభో పా.. |
| వందనముచేసి మునులందరు ఘనులైరి విందవైనట్టి గోవింద రామప్రభో పా.. |
| బృందారకాది సద్బృందార్చితావతార వింద ముని సందర్శితానంద రామప్రభో పా.. |
| తల్లివినీవె మాతండ్రివినీవె మా ధాతవునీవె మాభ్రాత రామప్రభో పా.. |
| పల్లవాధరలైన గొల్లభామలగూడి యుల్లమలరంగ రంజిల్లు రామప్రభో పా.. |
| మల్లరంగంబునందెల్ల మల్లులజీరి యల్ల కంసుని జంపు మల్ల రామప్రభో పా.. |
| కొల్లలుగ నీమాయ వెల్లివిరియగ జేయ సల్లాపమున క్రీడసల్పు రామప్రభో పా.. |
| తమ్ముడును నీవు పార్శ్వమ్ములంజేరి వి ల్లమ్ములెక్కెడి నిల్చుటిమ్ము రామప్రభో పా.. |
| క్రమ్ముకొనిశాత్రవులు హుమ్మనుచువచ్చెదరు ఇమ్మైనబాణములిమ్ము రామప్రభో పా.. |
| రమ్ము నాకభయమ్ము నిమ్ము నీపాదముల్ నమ్మినానయ్య శ్రీరామచంద్రప్రభో పా.. |
| కంటి మీ శంఖమ్ము కంటి మీ చక్రము కంటి మీ పాదముల్గంటి రామప్రభో పా.. |
| వింటి మహిమ వెన్నంటి తమ్ముడు నీవు జంటరావయ్య నావెంట రామప్రభో పా.. |
| మేము నీవారమైనాము రక్షింపుమ న్నాము జాగేల శ్రీరామచంద్రప్రభో పా.. |
| నామనోవీధిని ప్రేమతోనుండు మీ భూమిజాసహిత జయ రామచంద్రప్రభో పా.. |
| మీ మహత్త్వమ్ము విన మనమందు ప్రేమ వేమరున్ బుట్టు శ్రీరామచంద్రప్రభో పా.. |
| శ్యామసుందర కోమలం జానకీమనః కాముకం త్వం భజే రామచంద్రప్రభో పా.. |
| కామితార్థములిచ్చు నీ మహత్వము విన్న నా మొరాలించు నాస్వామి రామప్రభో పా.. |
| కామితప్రభుడవై ప్రేమతో రక్షించు స్వామి సాకేతపురి రామచంద్రప్రభో పా.. |
| అన్న రావన్న నీకన్న నామీద నెన రున్న వారేరి నాయన్న రామప్రభో పా.. |
| నిన్నెగాకను మరే యన్యులగానన్ గన్నతండ్రివిగ మాయన్న రామప్రభో పా.. |
| వెన్నదొంగిలి తిన్న చిన్నకృష్ణమ్మ ని న్నెన్నగా వశమె రావన్న రామప్రభో పా.. |
| ఎన్నెన్నో జన్మముల నెత్తజాలను ఇక నిన్నె నెమ్మదిని వర్ణింతు రామప్రభో పా.. |
| ఎన్నివిధములనైన నిన్నె నమ్మిన వాని మన్నించి దయచేయుమన్న రామప్రభో పా.. |
| పన్నగాధిపశాయి భావనాతీత ఆ పన్న నామనవి వినవన్న రామప్రభో పా.. |
| మేటివాక్యంబు మీసాటిదైవంబు ము మ్మాటికిని భువిలేదు మేటి రామప్రభో పా.. |
| పాడుదును మిమ్ము గొనియాడుదును మోదమున వేడుచున్నాను గాపాడు రామప్రభో పా.. |
| వేడుకోగానె నీజోడుకాడును నీవు కూడి రారయ్య నాతోడ రామప్రభో పా.. |
| నేడు నాకోర్కె లీడేరగాజేసి కా పాడరా కరినేలు జాడ రామప్రభో పా.. |
| మూడుమూర్తుల కాత్మమూలమై చెన్నొందు వాడవని శ్రుతులు నిన్నాడు రామప్రభో పా.. |
| చూడు మీభక్తులను గూడు మీరిపుల గో రాడు మీవల్ల గోవింద రామప్రభో పా.. |
| పుండరీకాక్ష మార్తాండవంశోద్భవా ఖండలస్తుత్య కోదండ రామప్రభో పా.. |
| కుండలిశయన భూమండలోద్ధరణ పా షండజనహరణ కోదండరామప్రభో పా.. |
| నిండుదయతోడ నాయండ బాయకను నీ వుండి గాపాడు కోదండరామప్రభో పా.. |
| జాతకౌతూహలం చక్షుకృత్యారమాం పూతసీతాపతే దాత రామప్రభో పా.. |
| పాతకులలో మొదటి పాతకుడ నావంటి పాతకుని కావుటే ఖ్యాతి రామప్రభో పా.. |
| భూతనాథుని విల్లు ఖ్యాతిగా ఖండించి సీతగైకొన్న విఖ్యాత రామప్రభో పా.. |
| పూతనాకల్మషోద్ధూత పె\న్శత్రు సం హారి శ్రీసీతాసమేత రామప్రభో పా.. |
| జాతినీతులులేక భూతలంబున దిరుగు ఘాతకుల బరిమార్చు నేత రామప్రభో పా.. |
| ఎప్పుడును గంటికి రెప్పవలె గాచి న న్నొప్పుగాగావు మాయప్ప రామప్రభో పా.. |
| ఏదయా నీదయా యోదయాంభోనిధీ యాదిలేదయ్య నామీద రామప్రభో పా.. |
| ఘోరరాక్షస గర్వహార విశ్వంభరో ద్ధార గుణసాంద్రవిస్తార రామప్రభో పా.. |
| మోదమున నీవు నన్నాదుకోవయ్య గో దావరీ తీర భద్రాద్రి రామప్రభో పా.. |
| నీదు బాణంబులను నాదుశత్రులబట్టి బాధింపకున్నావదేమి రామప్రభో పా.. |
| ఆదిమధ్యాంత బహిరాంతరాత్ముడవనుచు వాదింతునే జగన్నాథ రామప్రభో పా.. |
| చాలదేమి పదాబ్జములసాటి యీపదు నాల్గులోకంబుల గూడి రామప్రభో పా.. |
| ఏల యీలాగు జాగేల జేసెదవు మ మ్మేలుకోవయ్య మాపాలి రామప్రభో పా.. |
| పాలువెన్నలు మ్రుచ్చిలింతివని యశోద రోటగట్టిన మాయచాలు రామప్రభో పా.. |
| కొల్లలుగ వ్రేపల్లె పల్లవాధరులతో నల్లబిల్లిగను రంజిల్ల రామప్రభో పా.. |
| వాలి నొక్కమ్మునన్ గూలవేసిన శౌర్య శాలియౌ నినుదలతు జాల రామప్రభో పా.. |
| సాలభంజికల నిర్మూలంబు చేయగా జాలితివి గోపాలబాల రామప్రభో పా.. |
| తాళవృక్షము లొక్కకోల ధరగూలగా లీలనేసిన బాహుశాలి రామప్రభో పా.. (శిలయైన యహల్య శ్రీపాదములు సోక నెలతయై మిము మదితలచె పా..) వినవయ్య మనవి గైకొనవయ్య తప్పులన్ గనకయ్య సమ్మతిన్గొనుచు రామప్రభో పా.. |
| దానధర్మంబులున్ దపజపంబులు నీదు నామకీర్తనకు సరిరావు రామప్రభో పా.. |
| మానావమానములు మహిని నీవై యుండ మాకేల మదిని ఈచింత రామప్రభో పా.. |
| జ్ఞానయోగాభ్యాసమందు నుండెడివారి కానందమయుడవైనావు రామప్రభో పా.. |
| భానువంశమునందు మానవాధిపుడవై దానవుల బరిమార్చినావు రామప్రభో పా.. |
| అణురేణు పరిపూర్ణుడౌ హృదయవాస నా మనవి విను దేవకీతనయ రామప్రభో పా.. |
| మాన్యమై ఆశ్రితవదాన్యమై సుజన స న్మాన్యమై వెలుగు మూర్ధన్య రామప్రభో పా.. |
| నిత్యమై సత్యమై నిర్మలంబై మహిని దివ్యవంశోత్తంసమైన రామప్రభో పా.. |
| సేవ్యమై మీపదద్భావ్యమై సజ్జన శ్రావ్యమై యుండునో దివ్య రామప్రభో పా.. |
| గట్టిగా నీవున\న్ పట్టుగా విహితమౌ నట్టుగా మమ్ము చేపట్టు రామప్రభో పా.. |
| దిట్టయగు తాటకినిగొట్టి వేగమె గాధి పట్టి యాగము గాచినట్టి రామప్రభో పా.. |
| చుట్టుకొని కాళింగు డట్టహాసముచేయ పట్టుకొని తలనెక్కినట్టి రామప్రభో పా.. |
| సంతతము నన్ను రక్షింతువని నమ్మి మి మ్మెంతురా జానకీకాంత రామప్రభో పా.. |
| పంతమున మీ పాదచింతనము చేయ నా వంతలన్నియు మానుటెంత రామప్రభో పా.. |
| వింతగాదయ్య నేనింతనాడినది నా పంతమున మిమ్ము భావింతు రామప్రభో పా.. |
| శాంతమూర్తిని రమాకాంతుడవని చాల సంతసంబున నిన్ను నెంతు రామప్రభో పా.. |
| అక్షయంబైన నీకుక్షిలో లోకముల రక్షించితివి లక్ష్మీవక్ష రామప్రభో పా.. |
| దంతివత్సల భక్తచింతామణీ విశ్వ మంతయును నీవు రక్షించు రామప్రభో పా.. |
| పక్షివాహన శత్రునిక్షేపణా నన్ను రక్షించు మోక్షప్రదాత రామప్రభో పా.. |
| రక్షించి సజ్జనుల వీక్షించి దుర్జనుల రాక్షసుల శిక్షించినావు రామప్రభో పా.. |
| రక్షకుడవై జగద్రక్షణముచేయగా రాక్షసుల శిక్షించినావు రామప్రభో పా.. |
| లక్ష్మీకటాక్ష వీక్షణధార వృష్టి మా కక్షయంబుగ కటాక్షించు రామప్రభో పా.. |
| రావయా అభయంబు లీవయా నాస్వామీ నీవయా గతి దేవరాయ రామప్రభో పా.. |
| కావు కావుమటంచు కాకాసురుడురాగ కాచి రక్షించినావయ్య రామప్రభో పా.. |
| దేవదేవోత్తమా దేవేంద్రసన్నుతా కావవేనన్ను శ్రీరామచంద్రప్రభో పా.. |
| భావజజనక నా బాధలన్నియుమాన్పి యే విధంబునైన నేలు రామప్రభో పా.. |
| శ్రీవైష్ణవులపాలి చింతామణివి చాల సేవగైకొని కరుణచేయు రామప్రభో పా.. |
| భావమున మిముభక్తి సేవించు జనులకు కైవల్యమొసగు శ్రీరామచంద్రప్రభో పా.. |
| గోపాలురను గూడి యావులను మేపి ఆపదోద్ధారకుడవైన రామప్రభో పా.. |
| నాపాలి శ్రీరామ భూపాలకా నను కాపాడరావ గోపాల రామప్రభో పా.. |
| సారమౌశౌర్య విస్తారమౌ సుందరా కారసద్భక్తమందార రామప్రభో పా.. |
| శరణాగతత్రాణ బిరుదాంకితంబైన వరము నాకొసగు యేమరక రామప్రభో పా.. |
| శ్రీరామ రామేతి శ్రేష్ఠమంత్రము సారె సారెకును వింతగా జదువ రామప్రభో పా.. |
| శ్రీరామ నీనామ చింతనామృతపాన సారమే నాదుమది గోరు రామప్రభో పా.. |
| చేరి మీపాద పద్మారాధనము చేయ కోరినానయ్య శ్రీరామచంద్రప్రభో పా.. |
| ఘోరరాక్షసగర్వహారి విశ్వంభరా భూరిగుణసాంద్ర విస్తార రామప్రభో పా.. |
| మారీచమాయానివార శరసంధాన ధారుణీతనయా విహార రామప్రభో పా.. |
| పరవాసుదేవ యక్షయపాత్ర మొసగి న న్నరసి పోషింపగదవయ్య రామప్రభో పా.. |
| పరధనంబును పరస్త్రీల నపేక్షించు నరుకబ్బునే మోక్షమరయ రామప్రభో పా.. |
| కామాదిదుర్గుణ స్తోమంబులడగ మీ నామామృతమె దిక్కు రామచంద్రప్రభో పా.. |
| దుష్టులగు దానవుల నష్టంబుగా జేయగా బుట్టితివి కౌసల్య పట్టి రామప్రభో పా.. |
| కష్టపడలేనయ్య పట్టాభిరామ నా కిష్టసంపదలిచ్చి యేలు రామప్రభో పా.. |
| కేశవాయనిన భవపాశముల్దొలగు స ర్వేశకోటి శశిప్రకాశ రామప్రభో పా.. |
| నారాయణా నీదు నామామృతం బెపుడు పారాయణము చేతు నేను రామప్రభో పా.. |
| మాధవాయనియు సమ్మోదమున నినుగొల్చు సాధుసజ్జనదయాంభోధి రామప్రభో పా.. |
| గోవింద గోవింద గోపాలకృష్ణయని గోపకులు గొనియాడు గోపరామప్రభో పా.. |
| విష్ణునా సర్వవర్ధిష్ణునా తత్త్వ భూ యిష్ణునా నిర్మితం కృష్ణ రామప్రభో పా.. |
| శ్రీధరా శ్రీకరా శ్రీనారసింహ గం గాధర స్తోత్ర యానంద రామప్రభో పా.. |
| మత్స్యమై జలధిలో జొచ్చి సోమకుద్రుంచి తెచ్చి వేదము లజునకిస్తి రామప్రభో పా.. |
| కూర్మరూపము నొంది కొండమూపునదాల్చి కూర్మితో నమృతంబుగూర్చి రామప్రభో పా.. |
| వరాహరూపమున వసుధగొమ్ముననెత్తి సురల రక్షించు దాశరథి రామప్రభో పా.. |
| శరణన్న ప్రహ్లాదు గరుణించి రక్షింప నరసింహమూర్తివైనట్టి రామప్రభో పా.. |
| వామనత్వమున భూదానమడిగియు బలిని భూమిక్రిందనడంచి పొల్చు రామప్రభో పా.. |
| పరశురాముడనంగ నరపాలకులనెల్ల నరసిపొరికొన్న దాశరథి రామప్రభో పా.. |
| శ్రీరామమూర్తివై యారావణుని తలల్ ధారుణిన్ పడగూర్చినావు రామప్రభో పా.. |
| హలధరుడవై ధరాస్థలిపాలకులనెల్ల బొరిపుచ్చి వెలుగుమాపాలి రామప్రభో పా.. |
| సిద్ధసన్నుత మనోబద్ధుండవై నీవు బౌద్ధుండవైతి ప్రబుద్ధ రామప్రభో పా.. |
| కలికిరూపముదాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రినిలయ రామప్రభో పా.. |
| అవ్యయుడవైన నీయవతారముల జూచి దివ్యులైనారు మునులయ్య రామప్రభో పా.. |
| శ్రీరామనామమే వేళస్మరియింతు స్వామి దయచేయు సంపదను రామప్రభో పా.. |
| అప్ప శేషశయన యెప్పుడు నిను మరువ నొప్పుగా బ్రోవు వరదప్ప రామప్రభో పా.. |
| తెప్పరంబులుదీర్చి యిప్పుడేమరక నన్ ద్రిప్పు బెట్టక చేపట్టు రామప్రభో పా.. |
| పట్టాభిరామ నీపాదపద్మాశ్రయుల పాలింపుమా భద్రశైలి రామప్రభో పా.. |
| పట్టాభిరామ నిను ప్రభుడవని నమ్మితిని కష్టపెట్టకను చేపట్టు రామప్రభో పా.. |