కీర్తనలు భద్రాచల రామదాసు పొయ్యేటప్పుడు వెంటరాదుగా పుచ్చినవక్కైన
నాదనామక్రియ - ఆది
పల్లవి:
పొయ్యేటప్పుడు వెంటరాదుగా పుచ్చినవక్కైన
వెయ్యారులుదాచుకొనియు నర్థులకియ్యలేని లోభుల కయ్యయ్యో పొ..
చరణము(లు):
ఇచ్చిన మాత్రంబిచ్చును దైవము హెచ్చడిగిన రాదు
వచ్చేటప్పుడు వెంటనేమైన తెచ్చుకొన్నదిలేదు పొ..
హెచ్చుగనిది తెలియని పామరులు దురాశను తగులుకొని
యిచ్చట నార్జించిన ధనమెచ్చట కెత్తుకపొయ్యే రయ్యయ్యో పొ..
తనువును రక్షించుటకై మూలమూలలందును ధనము దాచెదరు
తనువును సుతబాంధవులు స్థిరమనితలచి గానగలేరు పొ..
తలతురు వారలు పశుసుతాదులు తనవని భ్రమసేరు
తనవారెక్కడ తానెక్కడనో తనువు విడిచి యాజీవు డొంటిగ పొ..
ఇరువుగ తొలిజన్మమున పేదలకియ్యని దోషమున
తిరిపెము లెత్తెడివారిని గాంచియు దెలియక యున్నారు పొ..
పరులకు బలిభిక్షంబులు బెట్టని పరమలోభులిలను
ధరలో వేంకటవిఠలుని దలపక ధనమదాంధమున దగిలి మానవుడు పొ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - poyyeeTappuDu veMTaraadugaa puchchinavakkaina ( telugu andhra )