కీర్తనలు భద్రాచల రామదాసు ప్రత్యక్షముగాను ఈవేళ బ్రతికించితివయ్యా
సావేరి - ఆది
పల్లవి:
ప్రత్యక్షముగాను ఈవేళ బ్రతికించితివయ్యా
సత్యము సత్యము నీవే నాదైవము రామచంద్రా ప్ర..
చరణము(లు):
ఝుమ్మను చీకటిలో వాన ఝరఝర గురియగను
ఇమ్ము సొమ్ములనిమ్మంటిని గుమ్మని దలచగాను
సొమ్మసిల్లుచును నా చిత్తము సొలసి జిల్లుమనగా
నమ్మదగిన నాదైవము నీవని నమ్మినందుకిపుడు ప్ర..
ఉబ్బలిలో దారినెరుగక తబ్బిబ్బు నడువగను
అబ్బురముగ నాకు చోరులు ముందుగనబడి యొరదీయగా
గొబ్బున వస్త్రముచే నాపై దెబ్బవేయరాగ
అబ్బాయనగా శ్రీరామాయని నే శరణంటిని యపుడు ప్ర..
అంత నహోవింతా చోరుని రంతు యెంతో వింతా
పంతముచెడి యా చోరులు పారిరి పరమపురుష స్వామీ
అంతట వేగమున నేను సుంత భయములేక
దంతిరక్షకా దాసపోషకా దయగల నా స్వామి ప్ర..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - pratyaxamugaanu iiveeLa bratikiMchitivayyaa ( telugu andhra )