| కీర్తనలు | భద్రాచల రామదాసు | బహుకాలమునకు శ్రీభద్రాచలశేషునకు పాదసేవకుడనైతి |
| కాంభోజి - ఆది |
| పల్లవి: |
| బహుకాలమునకు శ్రీభద్రాచలశేషునకు పాదసేవకుడనైతి అహహ నా జన్మము సఫలమాయె నేటికిని అనుమానములు దీరె నికను తగను బ.. |
| చరణము(లు): |
| తల్లి గర్భమునందు మల మూత్రముల మునిగి ధరణిపై జన్మించితి కల్లలాడుచు పాపకర్మము లొడిగట్టి కామపురుషులను జేరితి నీవేగతి బ.. |
| కోపుడను పాపుడను గుణహీనుడను నేను క్రూరుడను కుత్సితుడను రాపుచేయక నన్ను రక్షింపదలచు శ్రీరామచంద్రునకు భారమాయింకను బ.. |
| అఖిలలోకంబులకు నాధారమైయున్న యాది పురుషోత్తముండు సకియతో గూడిన సమయమందుజేరి సన్నుతులు చేయగలిగె తొలుగ రామదాసుని నేలుకొరకై శ్రీ భద్రాద్రిధాములై యుదయించి యేమి కొదవలు మనకు నెరుగ గలుగజేసె స్నేహంబు నితరమెల్ల కల్ల బ.. |