| కీర్తనలు | భద్రాచల రామదాసు | బూచివాని పిలువబోదునా ఓ గోపాలకృష్ణా బూ.. |
| పంతువరాళి - రూపక |
| పల్లవి: |
| బూచివాని పిలువబోదునా ఓ గోపాలకృష్ణా బూ.. |
| అను పల్లవి: |
| బూచివాని పిలువబోతె వద్దు వద్దు వద్దనేవు ఆ చిచ్చి జోలపాడి ఆయిఊచిన నిదురపోవు బూ.. |
| చరణము(లు): |
| మత్తగజముతెచ్చి చిన్నతిత్తిలో నమర్చి నాదు నెత్తిమీద బెట్టి నన్ను ఎత్తుకోమనేవు కృష్ణా బూ.. |
| అల్లమూరుగాయ పెరుగు అన్నమారగించమంటె తల్లి వెన్నపాలు నాకు తెమ్ము తెమ్ము తెమ్మనేవు బూ.. |
| రోటగట్టివేతు కృష్ణా రామదాసవరదా నీవు మాటిమాటికిట్లు నన్ను మారాము చేసితేను బూ.. |