కీర్తనలు భద్రాచల రామదాసు భజరే మానసరామం
నవరోప - ఆది (నవరోజు - త్రిపుట)
పల్లవి:
భజరే మానసరామం
భజరే జగదభిరామం భ..
కరధృత శరకోదండం
కరితుండాయుత భుజదండం భ..
చరణము(లు):
దాశరథీ నరసింహం
దాశరథీ సురసింహం
కౌసల్యా బహుభాగ్యం రామం
మైథిల్యాలోచన యోగ్యం భ..
అవనత జలజభవేంద్రం
అగణితగుణగణసాంద్రం
మాయామానుష దేహం ముని
మానస రుచికరదేహం భ..
రూపమదనశతకోటిం నత భూవదన శతకోటిం భ..
శ్యామసజలధరశ్యామం
సాంబశివానుత రామం
భద్రాద్రిచలనివాసం పరి
పాలిత శ్రీరామదాసం భ..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - bhajaree maanasaraamaM ( telugu andhra )