కీర్తనలు భద్రాచల రామదాసు భావయే పవమాన నందనం భావయే భా..
బిళహరి - త్రిపుట
పల్లవి:
భావయే పవమాన నందనం భావయే భా..
చరణము(లు):
మందార తరుమూల మానితవాసం
సుందర దరహాసం హరిదాసం భా..
రఘునాథ కీర్తన రంజిత చిత్తం
అఘహర శుభవృత్తం శమవిత్తం భా..
ఆనంద భాష్పాలంకృత నేత్రం
స్వానంద రసపాత్రం పవిత్రం భా..
భద్రాచలపతి పాదభక్తం
క్షుద్రసుఖోన్ముక్తం విరక్తం భా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - bhaavayee pavamaana naMdanaM bhaavayee bhaa.. ( telugu andhra )