కీర్తనలు భద్రాచల రామదాసు మానసమా నీవు మరువకుమా పెన్ని
మోహన - ఏక (- త్రిపుట)
పల్లవి:
మానసమా నీవు మరువకుమా పెన్ని
ధానము రామమంత్రాను సంధానము మా..
చరణము(లు):
సారంపు గురుభక్తి మీరకుమీ సం
సారఘోరాటవిలో దూరకుమీ దరి
చేరని కోర్కెల గోరకుమీ అయి
దారింటి వెనువెంట బారకుమీ భ్రష్ట మా..
పరదైవములకు మ్రొక్కకుమీ స్త్రీలోల
సరసిజముఖులకు దక్కకుమీ ఘోర
నరకదుఃఖములెల్ల బాయుసుమీ దా
శరథికథామృత సారములోరుచి మ..
చిద్రూపము వెలుగొందుసుమీ అజ
రుద్రాదులకెల్ల విందుసుమీ దా
రిద్ర్యవ్యాధికి మందు సుమీ శ్రీ
భద్రాచల రామదాసపోషక భక్తి మా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - maanasamaa niivu maruvakumaa penni ( telugu andhra )