| కీర్తనలు | భద్రాచల రామదాసు | మారుతే నమోస్తుతే మహామతే మారుతే నమోస్తుతే మా.. |
| భైరవి - తిశ్ర ఏక |
| పల్లవి: |
| మారుతే నమోస్తుతే మహామతే మారుతే నమోస్తుతే మా.. |
| చరణము(లు): |
| శ్రీరఘూత్తమ పాదచింతనాపహతభేద పూరితాంతర ప్రమోదభూషిత ధీతవేద మా.. |
| బుద్ధిబలాది దానపోషితాఖిల దీన సిద్ధయోగీశ ప్రధాన శ్రీహరే మంజులగాన మా.. |
| భద్రగిరి రామపాద భక్తజనిత వినోద భద్రదాయక ప్రసీద పాహిమామ్ మంజులనాద మా.. |