| కీర్తనలు | భద్రాచల రామదాసు | చ్చటైననాడవేమిరా కోదండపాణి ముచ్చటైననాడవేమిరా ము.. |
| నాదనామక్రియ - రూపక |
| పల్లవి: |
| ముచ్చటైననాడవేమిరా కోదండపాణి ముచ్చటైననాడవేమిరా ము.. |
| చరణము(లు): |
| ముచ్చటైననాడవేమి ముదమునను నీపాదములను మరువక నెల్లప్పుడు నా మదిని విడువక దలచెదనే ము.. |
| ఎందాక నేవేడుకొందు ఏమిచేయుదు నీవేళయందు ఎందుకు చేరితి నిను జేపట్టుమిక నన్ను ము.. |
| పండ్రెండేండ్లాయెను నేను బందిఖానలోనుండి నల్లులు దోమలచేత నలుగుచున్నది దేహము ము.. |
| చైత్రవైశాఖములిప్పుడు చెప్పతరముగాదు ఎంతో తహశీలుసేయ నాకు జామీనైనా యెవ్వరు లేరు ము.. |
| తానీషాగారు వచ్చి తహశీలు చేసెదరు కాసులుపంపించి నన్ను కరుణచేసి విడిపించు ము.. |
| నే నొక్కడను మీకు సుంతనాపై నెనరులేదు మాతల్లి సీతమ్మకైన మనవిచెప్పకెటుబోతివో ము.. |
| ఒంటరిగనున్న నింటిదగ్గర ఎవ్వరు జంటతో సీతారామలక్ష్మణులు వెంటనే కూడివచ్చి ము.. |
| వేమారు శ్రీభద్రాచల రామస్వామి మీరిప్పుడు రామదాసుని చేపట్టి రక్షింపకయున్నా ము.. |