| కీర్తనలు | భద్రాచల రామదాసు | రక్షించేదొరవని నమ్మితి నన్ను |
| బిలహరి - ఆది (-త్రిపుట) |
| పల్లవి: |
| రక్షించేదొరవని నమ్మితి నన్ను శిక్షింపగ తప్పేమి చేసితిని ర.. |
| రక్షించ మీకంటె రక్షకులెవరున్నారు దాక్షిణ్యమింతైన తలపున నుంచవు ర.. |
| చరణము(లు): |
| నీప్రాపు నెరనమ్మియుంటిని నన్ను కాపాడు బిరుదు నీదంటిని రామా నన్ను చేపట్టి విడనాడ జెల్లదు నిక నాకు దాపుననుండెడి దైవము సాక్షిగ ర.. |
| ఎంతోవేడిన యేలపల్కవు నే నెంత ద్రోహినో దయ జూడవు రామా ఎంతేసివారల నేలేటికర్తవు అంతకంతకు నాపై యరమర చేసేవు ర.. |
| భద్రాద్రివాస నీబంటును నితర పాపము లేదు నావెంటను రామా అద్రిజ సన్నుత అమరాదివందిత భద్రేభవరద నాపాలిటిదైవమ ర.. |