| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామ నా మనవిని చేకొనుమా దైవ ల |
| అసావేరి - చాపు |
| పల్లవి: |
| రామ నా మనవిని చేకొనుమా దైవ ల లామ పరాకు చేయకుమా రా.. |
| అను పల్లవి: |
| స్వామి భద్రాచలధామ పావన దివ్య నామ గిరిజనుత భీమ పరాక్రమ రా.. |
| చరణము(లు): |
| దరిలేని జనులను గాచే బిరుదు పూనితివి ఖ్యాతిగాను బరువగు నాబాధలను దీర్ప నీ మరుగు జేరితి న న్నరమరచేయకు రా.. |
| కపటమానసుడని మదిని యెన్న కిపుడు రక్షింపు సమ్మతిని అపరాధములకు నే నాలయమైతిని కృపజూడుము నన్ను నెపములెన్నకు రా.. |
| పతితపావన మూర్తివైన నీవే గతియని యుండితి మదిలోన సతతము రామదాస పతివై భద్రాద్రిని అతులిత వైభవతతులచే నెలకొన్న రా.. |