కీర్తనలు భద్రాచల రామదాసు రామ రామ రామ రామ శ్రీరామ రా..
ముఖారి - ఆది
పల్లవి:
రామ రామ రామ రామ శ్రీరామ రా..
చరణము(లు):
రామ రామ యని వేమరు నామది
ప్రేమమీర నిను పిలిచిన పలుకవు రా..
తలచినపుడె చాల ధన్యుడనైతిని
పిలిచిన పలుకవు పీతాంబరధర రా..
తిలకము దిద్దిన తీరైన నీమోము
కలనైన చూపవు కౌస్తుభభూషణ రా..
శంఖచక్రము లిరువంకల మెరయగ
పొంకముతో నా వంక జూడవేమి రా..
పరమపురుష భద్రగిరిరామదాసుని
కరుణ నేలుమని శరణని వేడితి రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raama raama raama raama shriiraama raa.. ( telugu andhra )