కీర్తనలు భద్రాచల రామదాసు రామ రామ రామ శ్రీ రఘు
యమునాకళ్యాణి - ఆది
పల్లవి:
రామ రామ రామ శ్రీ రఘు
రామ రామ రామ రామ రా..
చరణము(లు):
నరహరిదేవ జనార్దన కేశవ
నారాయణ కనకాంబరధారి రా..
రవికులాభరణ రవిసుతసఖ్య
రాక్షససంహార రాజసేవిత రా..
పన్నగశయనా పతితపావనా
కన్నతండ్రి యో కరుణాసాగరా రా..
కంతుజనక త్రిపురాంతక సాయకా
సీతానాయక శ్రీరఘునాయక రా..
సుందర శ్రీధర మందరోద్ధార
మకుటభూషణా ముద్భక్షకహరి రా..
నందనందనా నందముకుంద
బృందావిహారి గోవిందహరి రా..
వామన మాధవ వైకుంఠాధిప
దేవదేవ దేవారివిదారి రా..
పంకజలోచన పరమదయాళో
శంకరసన్నుత సర్వేశ్వరహరి రా..
పుండరీక వరదాండజవాహన
చండనిశాచరఖండనధీరా రా..
అంబరీష వరదాంబుజ లోచన
అంబుధిబంధన అమితపరాక్రమ రా..
భానుకులేశ భవభయనాశ
భాసురహాస భద్రగిరీశ రా..
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - raama raama raama shrii raghu ( telugu andhra )